హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాద బాధ్యుడికి ఏడు నెలల జైలు శిక్ష

NLG: 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణమైన లారీ డ్రైవర్ కొప్పుల నారాయణకు ఏడు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ దేవరకొండ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. అతివేగంగా లారీ నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు నిర్ధారణ కావడంతో ఈ శిక్ష ఖరారు చేశారు. కేసు దర్యాప్తులో సహకరించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.