హైదరాబాద్: 28°C
వార్తలు

మహారాష్ట్రలో ఏనుగుల గుంపు హల్‌చల్

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో 30కి పైగా ఏనుగులు హల్‌చల్ చేశాయి. సావాలి మూల్ తాలూకాలో పంటలను ధ్వంసం చేశాయి. కొమురంభీం జిల్లాకు 80 కి.మీ. దూరంలో ఏనుగుల గంపు సంచరిస్తోంది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తెలంగాణలోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు.