హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ వర్షానికి ఇద్దరు మృతి

TG: హైదరాబాద్‌ పాతబస్తీలో కురిసిన భారీ వర్షం ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో వర్షం కారణంగా కరెంట్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. అదే సమయంలో ఆటోలో వచ్చిన జాఫర్, అబూ అనే ఇద్దరు యువకులు కిందకు దిగుతూ.. చూడకుండా ఆ వైర్లను తాకారు. దీంతో విద్యుదాఘాతానికి గురై వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.