హైదరాబాద్: 28°C
క్రైమ్

నెల్లూరులో మహిళ దారుణ హత్య

నెల్లూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కనుపర్తి పాడుకు చెందిన రేవతిని శ్రీకాంత్ పడారుపల్లి చెరువు సమీపంలో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు తెలియజేశారు. రేవతికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా, భర్తకు దూరంగా ఉంటూ ఆరేళ్లుగా శ్రీకాంత్ తో కలిసి ఉంటోంది. ఆమె వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానించిన శ్రీకాంత్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.