హైదరాబాద్: 28°C
క్రైమ్

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఠాణెలోని టైర్ల గోదాములో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం కారణంగా పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే, గోదాములోని భారీగా టైర్లు కాలిపోవడంతో ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.