PLD: అచ్చంపేట మండలం వేల్పూరులో మంగళవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ “ప్రజల వద్దకు ప్రవీణ్–100 రోజులు 100 గ్రామాలు” కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
వేల్పూరులో పర్యటించిన ఎమ్మెల్యే భాష్యం


