హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రైవేటీకరణ విధానాలే ప్రమాదానికి కారణం'

VSP: స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి ప్రైవేటీకరణ విధానాలు, యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలన్నారు.