హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు చెరువు అభివృద్ధికి మంత్రి భూమి పూజ

AKP: నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఈనెల 10న పర్యటించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు గ్రామంలో చెరువు అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేస్తారన్నారు. అనంతరం ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో చెరువు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.