హైదరాబాద్: 28°C
వార్తలు

ఫేక్ పట్టాలపై విచారణకు సీపీఐ డిమాండ్

VZM: బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో ఫేక్, బినామీ పట్టాలతో జరిగిన అక్రమ నిర్మాణాలపై నిష్పక్షపాత విచారణ జరిపి పట్టాలను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్మించిన ఇళ్ల స్థలాలను అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కోరారు. ఫోర్జరీ పట్టాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.