హైదరాబాద్: 28°C
వార్తలు

పైడితల్లమ్మను దర్శించుకున్న గంటా

VSP: అడవివరం పైడితల్లమ్మ అమ్మవారిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసిందని గంటా తెలిపారు. అలాగే, పైడితల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.