హైదరాబాద్: 28°C
వార్తలు

దుర్గమ్మ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలం దేవిలాల్ తండాలో నిర్వహించిన దుర్గమ్మ పండుగ వేడుకల్లో మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల సుఖశాంతులు, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.