హైదరాబాద్: 28°C
క్రైమ్

రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

NLR: వేదాయపాలెం–వెంకటాచలం రైల్వే స్టేషన్ల మధ్య గోలుగుమూడి గేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. మృతుడి వయస్సు 30–35 సంవత్సరాలు ఉంటుందని, స్కై బ్లూ ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్, నలుపు రంగు జీన్స్, నలుపు రంగు స్పోర్ట్స్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు.