E.G: భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్ తల్లి వరలక్ష్మి మంగళవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడియంలోని వారి నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పుష్పమాలలు సమర్పించి, వరలక్ష్మి భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆకుల శ్రీధర్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వార్తలు
నివాళులర్పించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు


