హైదరాబాద్: 28°C
వార్తలు

నెలకు రూ. 1.90 లక్షల జీతంతో ఉద్యోగాలు

ATP: APSSDC ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కింద ఇటలీలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. లేజర్ కటింగ్, CNC మెషినింగ్, ఫోర్క్‌లిఫ్ట్ విభాగాలలో, బీటెక్/డిప్లొమా మెకానికల్ పూర్తి చేసి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న 25-30 ఏళ్ల యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 1.90 లక్షల జీతం లభిస్తుంది. జిల్లా అభ్యర్థులు నైపుణ్యం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.