హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రతి ఒక్కరూ న్యాయపరమైన మార్గంలోనే వెళ్లాలి'

BDK: మణుగూరు కోర్టు వాయిదాకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు పై జరిగిన దాడిని మంగళవారం ఎన్సీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ న్యాయపరమైన మార్గంలోనే ముందుకు వెళ్లాలని సూచించారు.