హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనం ప్రారంభం

TG: ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్ అథారిటీ (FCDA) నూతన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి ‘నెట్ జీరో’ గుర్తింపు పొందిన ఈ భవనం పర్యావరణ మిత్రగా, నాలెడ్జ్ హబ్‌గా నిలవనుంది. రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ పెట్టుబడులు, కీలక ఒప్పందాలన్నీ ఇకపై ఈ ప్రధాన కార్యాలయం నుంచే జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.