హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు సత్వర పరిష్కారం కలిగించాలి: ఎస్పీ

MDK: పోలీసులు న్యాయమైన దర్యాప్తుతో ప్రజలకు సత్వర పరిష్కారం అందించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆయన వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌లపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడంలో పోలీసులే ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.