KRNL: కోసిగి గ్రామ శివారుల్లోని భూగేని చెరువు వద్ద రూ.48 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి తనయుడు రాకేష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, సోలార్ లైట్లు, చిన్నారుల పార్క్ పనుల పురోగతిని తెలుసుకుని నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. భూగేని చెరువును ప్రజలకు ఆకర్షణీయమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
వార్తలు
భూగేని చెరువు అభివృద్ధి పనులు పరిశీలన


