హైదరాబాద్: 28°C
వార్తలు

రహదారులపై చెత్త వేస్తే చర్యలు: కమిషనర్

KRNL: నగరంలో రహదారులపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన, చెత్త ఎక్కువగా పేరుకుపోయే 50 ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇంటి చెత్తను రోడ్లపై కాకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలని, నగర పరిశుభ్రతకు సహకరించాలన్నారు.