హైదరాబాద్: 28°C
వార్తలు

డీఐజీ ప్రవీణ్‌ను కలిసిన నూతన సీఐలు

కర్నూలు రేంజ్‌లో ఎస్సైల నుంచి సీఐలుగా పదోన్నతి పొందిన పోలీసు అధికారులు మంగళవారం రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన డీఐజీ, పదోన్నతితో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో చొరవ చూపాలని తెలిపారు.