హైదరాబాద్: 28°C
వార్తలు

'హత్య కేసులో అప్పీలు విచారణకు 40 ఏళ్లా..?'

సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కిందికోర్టు వేసిన శిక్షను సవాలు చేస్తూ ఓ నిందితుడు 40 ఏళ్ల క్రితం వేసిన అప్పీల్‌ను విచారించేందుకు అలహాబాద్ హైకోర్టు జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆలస్యాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయని.. ఇలాంటి కేసుల్ని పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టును ప్రశ్నించింది.