హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కళ్లు పొడిబారకుండా ఉండాలంటే..?

రోజూ కంప్యూటర్, మొబైల్ స్క్రీన్లను ఎక్కువగా చూడటం వల్ల కళ్లు పొడిబారుతాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లు చూడాలి. తరచూ కనురెప్పలు ఆర్పడం వల్ల కంటిలో తేమ పెరుగుతుంది. రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. కంటి ఆరోగ్యం కోసం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఎ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, క్యారెట్లు, చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.