హైదరాబాద్: 28°C
క్రైమ్

చోరీ కేసు.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు

TG: గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసించే ఓ వ్యాపారి ఇంట్లో కిలో బంగారు నగలు, వజ్రాలు చోరీకి గురయ్యాయి. యజమానులు ముంబై వెళ్లిన సమయంలో.. నెల రోజుల క్రితమే పనిలో చేరిన నేపాలీ దంపతులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు, UP పోలీసుల సహకారంతో గంటల వ్యవధిలోనే నిందితులను బోర్డర్‌లో అరెస్ట్ చేశారు. వారిని నగరానికి తరలిస్తున్నారు.