MLG: తాడ్వాయి మండలంలోని పలు చెరువుల మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.58 లక్షలు మంజూరు చేసింది. ఊరచెరువు, కాంబోజరాజు చెరువు, ఆశన్నగూడెం-ఎల్లపురం చెరువు, ఎల్లమ్మకుంట, వెంకన్నకుంటలకు నిధులు కేటాయించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
'తాడ్వాయి చెరువుల మరమ్మతులకు రూ.58 లక్షలు'


