SRD: కంగ్టి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, హైస్కూల్ ఉపాధ్యాయులు మంగళవారం బడిబాట ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని వారు కోరారు. తమ పాఠశాలలో ఉచిత పుస్తకాలు, నోటుబుక్కులు, యూనిఫామ్ బట్టలు, నాణ్యమైన భోజనం, ప్రైవేటుకు దీటుగా పాఠాలు చెబుతామని తెలిపారు. ఇందులో హెచ్ఎం భాగ్యలక్ష్మి, టీచర్లు కిఫాయత్ అలీ ఉన్నారు.
వార్తలు
'పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించండి'


