హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్ఐఆర్ కార్యక్రమంపై ఎమ్మెల్యే అవగాహన

ATP: అనంతపురంలోని బి.వి.ఎస్ ఫంక్షన్ హాల్‌లో ఆత్మకూరు మండల నాయకులకు ఎస్ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని ఓటరు ధృవీకరణ, కుటుంబ లింకేజీలు, అభ్యంతరాల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.