హైదరాబాద్: 28°C
వార్తలు

'బడిబాట' ప్రచార గీతాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా

KNR: కలెక్టరేట్ ఆడిటోరియంలో 'బడిబాట' ప్రచార గీతాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.అశ్విని తనాజీ వాకడే పాల్గొన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి ఎన్.ప్రశాంత్ రెడ్డి గీతాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ గీతం కేవలం ఒక పాట కాదు, ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ఒక విద్యా ఉద్యమం అని తెలిపారు.