MLG: హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూన్ 10, 11 తేదీల్లో జరిగే పెసా చట్టం-2026 అవగాహన వర్క్‌షాప్‌కు వెంకటాపురం మండలం సూరవీడు గ్రామపంచాయతీ పెసా మొబిలైజర్ ఇరప రాజుకు ఆహ్వానం అందింది. గిరిజన ప్రాంతాల హక్కులు, గ్రామసభల పాత్ర, స్థానిక సుపరిపాలన అంశాలపై చర్చించనున్నారు. ఈ శిక్షణతో గ్రామస్థాయిలో పెసా అమలు మరింత బలోపేతమవుతుందన్నారు.
వార్తలు
పెసా చట్టం వర్క్‌షాప్‌కు ఇరప రాజుకు ఆహ్వానం


