హైదరాబాద్: 28°C
వార్తలు

లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్

లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పర్యాటకభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు 1979లో అమల్లోకి వచ్చిన లక్షద్వీప్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్‌ను రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 47 ఏళ్ల తర్వాత అమ్మకాలు జరగనున్నాయి. అయితే విదేశీ మద్యంపై 400 శాతం, బీర్లపై 200 శాతం, వైన్‌పై 80 శాతం సుంకాలు విధించింది.