అన్నమయ్య: కోడూరు నియోజకవర్గం నగిరిపాడు పంచాయతీ పరిధిలోని ఎగువపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో గల రామిరెడ్డి కుంటలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై ప్యాంట్ మాత్రమే ఉంది. చిట్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
రామిరెడ్డి కుంటలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం


