హైదరాబాద్: 28°C
వార్తలు

ఫైరింగ్ కేసు.. ఖాన్ సార్‌కు భారీ ఊరట

పాట్నా కోర్టులో ఖాన్ సార్‌కు భారీ ఊరట లభించింది. ఖాన్ గ్లోబల్ స్టడీస్ కోచింగ్ సెంటర్ ముందు ఫైరింగ్ జరిగిన కేసులో ఖాన్ సార్‌ను అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. రెండు కోచింగ్ సెంటర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే ఆందోళకారులపై సెక్యూరిటీ గార్డుతో ఆయన ఫైరింగ్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనకు బీహార్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.