హైదరాబాద్: 28°C
వార్తలు

గుడివాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన

కృష్ణా: పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం గుడివాడలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. వామపక్ష శ్రేణులు పట్టణంలో ర్యాలీ చేసి విజయవాడ రోడ్డు ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.