హైదరాబాద్: 28°C
వార్తలు

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

KMR: జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఇవాళ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా సిబ్బంది విధులను పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు.