హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం క్లియరెన్స్‌

గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. రూ.13 వేల కోట్ల వ్యయంతో పౌర-సైనిక అవసరాలు తీరేలా గలాథియా బే సమీపంలోని చింగెన్ వద్ద ఈ విమానాశ్రయాన్ని కేంద్రం నిర్మించనుంది. రానున్న ఐదేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. ఈ ప్రాంతంలో వైమానిక సదుపాయాలు ఉండటం నిఘాకు ఎంతో కీలకం. ఈ ప్రాజెక్టుపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ అనుమతులు రావడం గమనార్హం.