హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమల్నేర్-ధూలే రహదారిలో బైక్, బస్సులను వేగంగా వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారంతా గుజరాత్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారిస్తున్నారు.