హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే రోజు 15,200 వాటర్ ట్యాంకర్ బుకింగ్స్

TG: HYDలో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత తారాస్థాయికి చేరుకుంది. ఈ వేసవిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ పరిధిలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 15,200 వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ నమోదయ్యాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాటర్ బోర్డు ట్యాంకర్ల సంఖ్యను పెంచినప్పటికీ, సరఫరాలో 2 నుంచి 4 రోజుల వరకు ఆలస్యం జరుగుతోందని అధికారులు తెలిపారు.