హైదరాబాద్: 28°C
వార్తలు

కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం

కర్ణాటక బెళగావి జిల్లా బైల్‌హోంగల్ తాలూకాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి 12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు జలమయమై ఇళ్లలోకి వరద వచ్చి చేరింది. వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. బైల్‌హోంగల్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.