హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: వాటర్ ట్యాంకులో పాముల కుప్ప

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఇంటి పైనున్న వాటర్ ట్యాంకులోకి నీళ్లు వెళ్లకపోవడంతో యజమానులు ట్యాంక్ మూత తీశారు. లోపల చూస్తే 27 పాములు ఒకదానిపై ఒకటి మెలికలు తిరుగుతూ కనిపించాయి. భయంతో వణికిపోయిన ఆ కుటుంబం అటవీ శాఖను ఆశ్రయించింది. సిబ్బంది వచ్చి ట్యాంకులోని పాములన్నింటినీ బయటకు తీసి వాటిని అడవిలో వదిలేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.