హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రిలో నిలిచిన ఓపీ సేవలు

SRPT: సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సాంకేతిక సమస్యలు రోగులకు చుక్కలు చూపించాయి. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో గంటసేపు ఓపీ సేవలు స్తంభించాయి. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, సేవలను పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు.