హైదరాబాద్: 28°C
వార్తలు

వేలేరు సమగ్ర అభివృద్ధికి చర్యలు: సర్పంచ్

HNK: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వేలేరు సర్పంచ్ బిల్లా యాదగిరి తెలిపారు. పల్లగుట్టలో డిప్యూటీ సీఎం సభకు హాజరయ్యేందుకు సుమారు 200 మంది గ్రామస్తులతో కలిసి బయలుదేరినట్లు సర్పంచ్ తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని సర్పంచ్ అన్నారు.