హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 15 నుంచే అమ్మమాట-అంగన్వాడీ బడిబాట కార్యక్రమం

నల్గొండ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల నమోదును పెంచేందుకు ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో అమ్మమాట-అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణవేణి తెలిపారు. నల్గొండ జిల్లాలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 2093 అంగన్వాడీ కేంద్రాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.