హైదరాబాద్: 28°C
వార్తలు

క్షిపణిదాడి.. 24 మంది భారతీయులు సేఫ్‌

ఒమన్ తీరంలోని పలావ్‌ దేశానికి చెందిన వాణిజ్య నౌకపై క్షిపణిదాడి జరిగింది. సమాచారం అందుకున్న ఇండియన్‌ కోస్ట్‌ తక్షణమే స్పందించి.. ఒమన్‌ అధికారులతో సంప్రదింపులు జరిపింది. వెంటనే రంగంలోకి దిగిన ఒమన్ అధికారులు హెలికాప్టర్‌ సహాయంతో 24 మంది భారతీయులను సురక్షితంగా రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.