హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్వాల్ గల్లీ దర్గా సమీపంలో డ్రైనేజీ సమస్య

KMR: లింగంపేట్ 12వ వార్డులోని కొత్వాల్ గల్లీ దర్గా సమీపంలో డ్రైనేజీ కాలువలో ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర చెత్త పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య పనులను చేపట్టాలని, అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీని శుభ్రపరిచి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.