ఒడిశాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరీలో జగన్నాథ రథయాత్రకు ముహూర్తం ఖరారైంది. జూలై 16వ తేదీన పవిత్ర రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవీ విగ్రహాలను శ్రీమందిరం నుంచి ఊరేగిస్తూ మూడు కి.మీ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుస్తారు. ఈ మార్గంలో రథాన్ని లాగేందుకు వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు.
వార్తలు
పూరీ జగన్నాథ రథయాత్రకు ముహూర్తం ఖరారు


