హైదరాబాద్: 28°C
వార్తలు

మరో వ్యాధి కలకలం.. ఇద్దరు మృతి

కేరళలో మరో వ్యాధి కలకలం రేపుతోంది. షిగెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా సోకి ఇద్దరు చిన్నారులు మరణించారు. అంతేకాకుండా ఈ కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 85 కంటే ఎక్కువ కేసులను గుర్తించినట్లు చెప్పింది. ఈ కేసులు ప్రధానంగా కోజికోడ్, వయనాడ్, మలప్పురం, అలప్పుళ జిల్లాల్లోనే నమోదయ్యాయి. వెంటనే ఆ ప్రాంతాలను అధికారులు శానిటైజ్ చేశారు.