హైదరాబాద్: 28°C
వార్తలు

జోజిలా టన్నెల్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి!

జమ్మూకశ్మీర్‌లో కీలకమైన జోజిలా టన్నెల్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సొరంగ మార్గం జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను కలుపుతుంది. ఇది రెండు ప్రాంతాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. సముద్ర మట్టానికి దాదాపు 11,578 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ సొరంగ మార్గం దాదాపు 13.15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహదారి సైన్యానికి కీలక మార్గంగా మారనుంది.