TG: ఖమ్మం జిల్లాలో ఓ దుండగుడు 12 ఏళ్ల బాలికపై ఘాతుకానికి పాల్పడ్డాడు. లైంగిక దాడి చేసి బాలికను భవనంపై నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో బాలిక వెన్నుముక, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నెల 6న బాలికపై లైంగిక దాడి జరగ్గా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం గమనార్హం.
క్రైమ్
దారుణం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం


