గద్వాల జిల్లాలో మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి 2026- 27లో ప్రభుత్వం రూ. 272.99 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్రామీణ ప్రాంతాలకు రూ. 212 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ. 64 కోట్లు కేటాయించింది. అర్హత ఆధారంగా సంఘాలకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు అందించనున్నారు. ఈ అవకాశంతో మహిళలు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా ఎదగాలని డీఆర్డీవో ముషాహిదా బేగం సూచించారు.
వార్తలు
'మహిళా సంఘాలకు రూ. 272.99 కోట్ల రుణ లక్ష్యం'


