హైదరాబాద్: 28°C
క్రీడలు

గ్రౌండ్‌లో పీరియడ్స్.. స్మృతి ఏం చెప్పిందంటే?

దేశం కోసం మైదానంలోకి దిగినప్పుడు పీరియడ్స్ నొప్పిని సైతం లెక్కచేయమని టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చెప్పింది. అయితే దీనిని సాకుగా చూపలేమని, ఆ నొప్పితో ఎలా ఆడాలో ట్రైనింగ్‌లోనే అలవాటు చేసుకుంటామని తెలిపింది. 'ఒకసారి నేను ప్యాడ్ ధరించేందుకు పరిగెత్తా. వైట్ జెర్సీ వేసుకోవడంతో అంపైర్ అనుమతించకతప్పలేదు. నా పరిస్థితి ఆమె అర్థం చేసుకున్నారు' అని వెల్లడించింది.