NLR: సంగంలోని శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం వేకువజామున జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పుర వీధుల్లో శ్రీ పాలేటి గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా సాగింది. గ్రామోత్సవాలలో వివిధ రకాల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
వార్తలు
ఘనంగా శ్రీ పాలేటి గంగమ్మ తల్లి జాతర మహోత్సవం


